Ticker

6/recent/ticker-posts

మీకు తెలుసా - మైల్ స్టోన్స్ ఏమి చెపుతాయో?

  primaryschool milestones   

 మీకు తెలుసా -  మైల్ స్టోన్స్  ఏమి చెపుతాయో?

             మనం ఏ ఊరైనా వెళ్ళేటప్పుడు అంకెలు వ్రాసిన  చిన్న రాళ్ళు రోడ్డు ప్రక్కనే ఉండటం చూస్తుంటాము. వాటిని ఏమంటారో మీకు తెలుసా ? వాటిని మైల్ స్టోన్స్ లేక కొలతరాళ్ళు అని అంటారు. ఇవి పలానా ప్రదేశం ఇంత దూరంలో ఉంది అని చెపుతాయి. మన దేశ రోడ్డు వ్యవస్థలో గ్రామ స్థాయి రోడ్లు ,జిల్లా స్థాయి రోడ్లు , రాష్ట్ర స్థాయి రోడ్లు , జాతీయ స్థాయి రోడ్లు  అని వివిధ రకాలు ఉన్నాయి.  అయితే ఈ రోడ్లు ఎలా వేర్వేరుగా ఉన్నాయో అదేవిదంగా  మైల్ స్టోన్స్ కూడా వేర్వేరు రంగులలో ఉంటాయి . ఏ రోడ్లపై మైల్ స్టోన్స్  ఏ రంగుల్లో ఉంటాయో  చూడండి . 



     1.  గ్రామ స్థాయి రోడ్లపై నారింజ రంగు పట్టీతో తెలుపురంగులో ఉంటాయి .

     2. జిల్లా స్థాయి లేక సిటీ స్థాయి రోడ్లపై నీలం లేక నలుపు రంగు పట్టీతో తెలుపురంగులో  ఉంటాయి

     3. రాష్ట్ర స్థాయి రోడ్లపై ఆకుపచ్చ రంగు పట్టీతో  తెలుపు రంగు లో ఉంటాయి. 

     4. జాతీయ స్థాయి రోడ్లపై పసుపు రంగు పట్టీతో తెలుపు రంగులో ఉంటాయి. 


                                     పానుగంటి సాయి నివేశ్
                                                 4 వ తరగతి
                                GPS (TW) పూర్ణపాడు
                                       కొమరాడ మండలం
                                        విజయనగరం జిల్లా
     
      

       

Post a Comment

0 Comments