Ticker

6/recent/ticker-posts

ఉపాధ్యాయుల అనుభవాలు - అనుపోజు సరస్వతి

          
primaryschool

                 బంటువానివలస  అనే గ్రామంలో స్వాతి అనే ఒక చిన్నారి పాప ఉంది. ఆ పాప ఒకటవ తరగతి చదువుతుంది. రోజూ పాఠశాల కు వెళుతూ వాళ్ల టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ , బాగా చదువు  కుంటుంది.     తరగతి గదిలో టీచరు ఒకటవ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ పాఠం THIRSTY CROW  చెప్పారు. పాఠ పూర్తయ్యాక టీచరు పిల్లలతో చూశారా పిల్లలు .. మనకి దాహం వేస్తే ఇంటిలో ఉన్న బిందెలో , ఫ్రిజ్లో కుండల్లో నీళ్లు తాగుతాం కదా ! మరి పక్షులు జంతువులకు దాహం వేస్తే అవి ఎలా నీళ్ళు తాగుతాయి ? వాటికి ఇళ్ళు ఉండవు కదా!  వాటి, దాహం తీరడానికి , ఆహారం సంపాదించడానికి ఎంతో శ్రమించాలి కదా ! పాపం వాటికి ఆహారం  నీరు ఎవరిస్తారు? అని అడిగారు. 


           పిల్లలూ ! మరి పక్షులు జంతువులు ఆహారాన్ని ఎలా సంపాదిస్తాయో  మీకు తెలుసా ? వాటికి బాగా దాహం వేస్తే ఏమి చేస్తాయి? మీరేమైనా వాటికి సహాయం చేయగలరా? ఆలోచించి  రేపు చెప్పండి. అని ఆ టీచర్ పాఠం ముగించారు. 

       

            ఆ రోజు సాయంత్రం స్వాతి స్కూల్ నుండి ఆడుకుంటూ ఇంటికి వెళ్ళింది. వాళ్ల ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు , మామిడి చెట్లు ఉన్నాయి. వాటిపై రకరకాల పక్షులు వచ్చి వాలుతూ ఉంటాయి .  స్వాతి వాళ్ళ అమ్మ కోళ్లను పెంచుతుంది . వాటికి వాళ్ళ అమ్మ గిన్నెల్లో నీరు పోసి ఉంచడం చూసింది . కోళ్లు అయితే మన చుట్టూ తిరుగుతాయి . వాటికి నీరు , ఆహారం పెట్టొచ్చు . కానీ చెట్లపై ఉండే పక్షులకు, ఎలా నీరు , గింజలు పెట్టడం అని ఆలోచించింది. తను ఆడుకునే చిన్న చిన్న డబ్బాలతో  చెట్లపై నీరు , గింజలు పడితే బాగుంటుంది . అనుకుంది.

            మర్నాడు  టీచర్ తో స్వాతి "టీచర్ టీచర్ నేను చిన్న చిన్న డబ్బాలు తెచ్చాను . వాటిలో నీరు పోసి గింజలు వేసి చెట్లకు వేలాడదీద్దాము . దాహం వేస్తే పక్షులు నీరు తాగుతాయి కదా" అంది . 

       టీచరు స్వాతి ని మెచ్చుకొని తన ఆలోచనను పిల్లలందరికీ చెప్పారు.మరియు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లకు చిన్న చిన్న డబ్బాలలో నీరు , గింజలు ఉంచి వేలాడదీసారు. అక్కడికి ఉడుతలు ,పక్షులు వచ్చి నీరు త్రాగుతుంటే పిల్లలంతా చాలా సంతోషించారు. 


          ప్రతి విద్యార్థి కూడా వీలైనంత వరకూ వారి బడిలో ఉన్న చెట్లకు ఇంటి చుట్టూ ఉన్న చెట్లకు ఇలా నీరు పెట్టమని టీచర్ చెప్పారు .  ప్రతి ఒక్కరికి జంతువులు ,  పక్షుల ఉన్పట్ల భూత దయ ఉండాలని టీచర్ చెప్పారు .  పిల్లలందరూ స్వాతిని  చప్పట్లు కొట్టి అభినందించారు . 



       శ్రీమతి అనుపోజు సరస్వతి

                                 టీచర్

                    M.P.P. స్కూల్

                 బంటువానివలస

            గరుగుబిల్లి మండలం

               

Post a Comment

1 Comments

Unknown said…
పిల్లలకు సృజనాత్మకశక్తి ని పెంపొందించు విధంగా మీరు చేస్తున్న కృషి కి అభినందనలు