బాగా ఆకలితో ఉన్న ఒక నక్కకు ఒక మాంసం ముక్క దొరికింది . భలే భలే ఈ మాంసం ముక్క తో నా ఆకలి తీరిపోతుంది . అదిగో ఆ చెట్టు క్రింద కూర్చొని హాయిగా తింటాను . అనుకోని చెట్టు వైపుకు నడుచుకుంటూ వెళ్ళింది . అదే దారిలో నాలుగు కోడిపుంజులు గింజలు మేస్తూ కనిపించాయి . నక్కకు నోరూరింది. ఈ మాంసం ముక్కతో ఈ ఒక్క రోజే ఆకలి తీరుతుంది . ఈ కోళ్లు దొరికితే నాలుగు రోజులు విందు చేసుకోవచ్చు . అనుకోని ఆ కోళ్లు ఉన్న దగ్గరికి వెళ్ళబోయింది .ఇంతలో ఒక కాకి "నక్క బావ నక్క బావ ఎక్కడకు ఉత్సాహంగా వెలుతున్నావు" అని అడిగింది. "అదిగో అదిగో అక్కడ నాలుగు కోళ్లు ఉన్నాయి కదా వాటిని పట్ట్టుకుందామని వెళుతున్నాను " అని అంది . నీ దగ్గర మాంసం ముక్క ఉందికదా ! దానిని తినవచ్చు కదా ? ఆ కోళ్లు దగ్గర మనుష్యులు ఉన్నారు దొరికావంటే చావ బాదుతారు .అని కాకి చెప్పినా వినకుండా మాంసం ముక్కను చెట్టుక్రింద పెట్టి కోళ్ళదగ్గరకు వెళ్ళింది. ఒక కోడిని పట్టుకోబోయే సరికి అక్కడ ఉన్న మల్లన్న కర్రతో నక్క వీపు మీద గట్టిగా కొట్టాడు . కుయ్యో మొర్రో అంటూ మాంసం ముక్కనైన తిందామని చెట్టు దగ్గరకు పరుగెత్తింది నక్క . చూస్తే అక్కడ మాంసం ముక్క లేదు. కాకి బావ ! కాకి బావ ! నా మాంసం ముక్క నీవు చూసావా ? అనిఅడిగింది నక్క . ఇదంతా దూరం నుండి చూస్తున్న కాకి నక్క బావా ? నీవు దురాశకు పోయావు దొరికిన మాంసం ముక్క తో తృప్తి పడక కోళ్ల కోసం వెళ్ళావు . నీకు కోడి దొరక లేదు సరిగదా అదిగదిగో ఆ గ్రద్ద నీ మాంసం ముక్కను కూడా పట్టుకుపోతుంది.అదికూడా నీకు దక్కలేదు. నీ దురాశే నీకు దుఃఖాన్ని కలిగించింది . ఇకనైనా దొరికిన దానితో తృప్తి పడు అని ఓదార్చింది.
నీతి : దురాశ దుఃఖానికి మూలం.

0 Comments