ఉదయించని ఉదయం కోసం
నువ్వు వెతికే వెతుకులాటలో పడి
నీ చుట్టూ ఉన్న సాయం సంధ్యను ,వెన్నెలను
మరువకు మిత్రమా !!!!
ఆ చిన్న వెలుగులో కూడా
నువ్వు కొత్త బాటలు వేసుకోవచ్చు
నీ నీడ కూడా నీకు కనబడట్లేదు అంటే ఎలా?
వెలుగులోకి వచ్చి చూడు
నీ నీడ నీ వెంటే అచ్చం అమ్మలాగే !!!!
N. రోజా రాణి
టీచర్
ఎం ఇ స్కూల్ జగన్నాథపురం
పార్వతీపురం

2 Comments