Ticker

6/recent/ticker-posts

కవిత - ఓ మహిళా

Primary school international women's day

అంతర్జాతీయ మహిళా  దినోత్సవం సందర్భంగా..

ఈ భువిపై పుట్టిన పరిమళాల మల్లిక 

 ఈ జన్మకు ఆడపిల్లగా పుట్టిన నీవు....


తల్లి కి ముద్దులొలికే బిడ్డలా

నాన్నకు గారాల పట్టిలా 

అన్నకు అనురాగాలు పంచే అమృతవల్లిగా

తమ్మునికి చేయూతనిచ్చే కల్పవల్లిగా

అక్కకు మురిపాల చెల్లిగా

చెల్లికి చెలిమిని పంచే చెలమ గా

స్నేహితులకు చక్కని స్నేహాలతగా


భర్తకు మంచి బహుమతిగా

మెట్టినింట మల్లెతీగలా

పిల్లలకు అనురాగాలు పంచే అమ్మలా

ఉద్యోగ నిర్వహణ లో ఉత్తమురాలిగా

సమస్యా సాధనలో ధీర వనితగా....


ఇన్ని పాత్రలు పోషించ గలిగే నీవు

జగత్తుకే ఆదర్శం.


ఓ స్త్రీ మూర్తీ!

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


మహిళా మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో అభినందన మందారమాల.


                                      అనుపొజు సరస్వతి
                                                           టీచర్
                  ఎం పి పి స్కూల్ బంటువానివలస
                                      గరుగుబిల్లి మండలం



Post a Comment

0 Comments