కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్
భావం:-
చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం,
శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి
ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం
అనే గుణం-
ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి.
0 Comments