Ticker

6/recent/ticker-posts

నీతి కథలు - కలసి ఉంటే కలదు సుఖం

neethi kathalu

           అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండే వాడు . అతని వద్ద నాలుగు ఎడ్లు  ఉన్నాయి . అవి తరుచుగా దగ్గరలోని అడవికి మేతకు వెళుతూ ఉండేవి. ఒకరోజు అవి అడవిలో పచ్చిక మేస్తుండగా ఒక పెద్దపులి ఒక ఎద్దుపై దాడిచేసింది . మిగిలిన మూడు ఎద్దులు ఆ ఎద్దుకు సాయంగావెల్లాయి .  నాలుగు ఎద్దులూ ఒక్కసారిగా పులిపై తిరగబడి కొమ్ములతో దాడి చేశాయి .పులి భయపడి పారిపోయింది.
                 కొన్నిరోజుల తర్వాత నలుగెద్దులు తమలో తాము పొట్లాడుకొన్నాయి . ఆ విషయాన్ని పులి గమనించి ఒక ఎద్దు పై పంజా విసిరింది. మిగిలిన మూడు ఎద్దులు ఏమి పట్టనట్టు ఉన్నాయి. పులి చక్కగా ఆ ఎద్దును తినేసింది.
              మరొక రోజు ఈ విధంగానే రెండవ ఎద్దును తినేసింది. మిగిలిన రెండు ఎద్దులు ఎప్పటిలాగే ఏమీ పట్టనట్టు ఉన్నాయి. ఈ విధంగా ఆ ఎద్దులలో ఐక మత్యం లేకపోవడం వలన పులి వాటన్నిటినీ తినేసింది.


         నీతి :- కలసి ఉంటే కలదు సుఖం



    ధర్మవరం శివ ప్రసాద్ రావు 
                                 టీచర్
ఎం ఇ స్కూల్ జగన్నాధపురం
             పార్వతీపురం

                                                                 Editor and founder

                                                           Primary school Magazine

             

Post a Comment

0 Comments