మీకు తెలుసా - ఫ్లూటో ను ఎందుకు గ్రహంగా పరిగణించలేదు .
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) నిర్వచనం ప్రకారం గ్రహం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి . తనను తాను గోళాకారంగా మర్చికొనేటంత గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండాలి. తన చుట్టూ ఉన్న వస్తువులను తనలో కలిపేసుకొగలగాలి. సూర్య కుటుంబం లోబుధుడు ,శుక్రుడు , భూమి , కుజుడు ( అంగారకుడు) , గురుడు , శని , యురేనస్ , నెఫ్టూన్ లకు ఈ శక్తి ఉంది . కానీ ఫ్లూటో తన చుట్టూ ఉన్న వస్తువులను తనలో కలుపుకోలేదు . కాబట్టి ఫ్లూటో ను గ్రహంగా పరిగణించలేదు .
సౌర వ్యవస్థలో ఉన్న వస్తువులను గ్రహాలు , మరగుజ్జు గ్రహాలు , చిన్నవస్తువులు గా విభజించారు.
గృహాలు , మరగుజ్జు గ్రహాలు కాకుండా మిగిలిన వస్తువులను సౌర కుటుంబం లో చిన్న వస్తువులుగా పరిగణిస్తారు . ప్లూటో మరగుజ్జు గ్రహం మరియు ఇది కైపర్ బెల్ట్ లో పుట్టింది.
0 Comments