Ticker

6/recent/ticker-posts

నీతి పద్యాలు - వేమన శతకం - మేడి పండుచూడ మేలిమై యుండును.......

ఆ.  మేడిపండు చూడ మేలిమై యుండును
       పొట్ట విప్పి చూడ బురుగులుండు
       పిరికివాని మదిని బింకమీలాగురా
       విశ్వదాభిరామ వినురవేమ .
 
టీకా : మేడిపండు = మేడి చెట్టు యొక్క పండు , చూడ =  చూచుటకు , మేలిమై =  బంగారం వలె పచ్చగా , పొట్ట విప్పి చూడ = పండు ముక్కలు చేసి చూడగా , పురుగులుండు = పురుగులుండును , పిరికివాని మదిని = పిరికివాని మనసులో , బింకము = ధైర్యము , ఈ లాగురా ఈ విధంగానే ఉండును. 

తాత్పర్యము : ఓవేమనా ! మేడిపండు చూచుటకు బంగారము వలె పచ్చగా ఉంటుంది. కానీ దానిని ముక్కలు చేసి చూడగా లోపల పురుగులు కనిపించును. అదేవిధంగా పిరికివాడు చూచుటకు పైకి గంభీరంగా కనిపించుచున్నాను లోపల మాత్రం భయంతో ఉండను. 

Post a Comment

0 Comments