Ticker

6/recent/ticker-posts

బాల గేయం ‌- మా చిన్నారి

 బుజి బుజి అడుగుల బుజ్జాయి

చిట్టి చేతుల చిన్నారి

గబగబ బడికి వచ్చింది

పలకా బలపం పట్టింది

అ ఆ ఇ ఈ దిద్దింది


గలగల పారే గోదారి

పాఠాలన్నీ చదివింది

చక చక చదువులు చదివింది

సూది మందులు పొడిచింది

భలే భలే మా చిన్నారి

మా మంచి డాక్టరోయి.

 

శ్రీమతి ఎన్ . రోజా రాణి 
టీచర్ 
ఎం ఇ స్కూల్ జగన్నాధపురం ,పార్వతీపురం   

Post a Comment

0 Comments