Ticker

6/recent/ticker-posts

నీతి కథలు - కణిక నీతి

 

primary school kanika neethi

     
                                                                శ్రీ భెహరా ఉమామహేశ్వర రావు 
                                              జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత 
                                                     పార్వతీపురం
 
                                  విచిత్రవీర్యుని  కుమారుడు  దృతరాష్ట్రుడు ఇతడు  విచిత్రవీర్యుని భార్య అయిన అంబికకు వేదవ్యాసుని బీజము వలన  ఉద్భవించాడు. విచిత్రవీర్యుని మరణానంతరం వంశాభివృద్ధికై వ్యాసుని  బీజదానం జరిగింది .   అలాగే  అంబాలికకు  వ్యాసుని  వలన  పాండురాజు  జన్మించాడు . 

                  దృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి.  ఇతని సోదరుడు పాండురాజు పాండు రోగం తో బాధపడేవాడు . కురువంశ మూలపురుషుడైన  భీష్ముడు ధృతరాష్ట్రుడిని కురు వంశానికి రాజుగా చేశాడు . ఇతనికి దుర్యోధన , దుశ్శాసనాదులు నూరుగురు కుమారులు . పాండురాజుకి  ధర్మరాజు భీమా అర్జున నకుల సహదేవులు అనే అయిదుగురు కుమారులు.  పాండురాజు తన సోదరుడైన దృతరాష్ట్రునికి రాజ్యపాలనలో సహకరించే వాడు ఇతను మరణించినతర్వాత మంత్రుల సహాయం తో పాలన సాగించాడు ధృతరాష్ట్రుడు. 

                      వీరిలో ప్రధాని విదురుడు ఈతడు ధర్మపరుడు ,  పండితుడు మరియు నీతి కోవిదుడు . రాజ్యపాలనలో ధర్మాధర్మాలు తెలిపేవాడు. ధృతరాష్ట్రుని ముఖ్య సలహాదారు సంజయుడు ఇతడు రెండవ మంత్రి . అవసరమైనప్పుడు రాయబారాలు నెరెపేవాడు .  అంతరంగికుడు గా కూడా వ్యవహరించేవాడు మూడోవాడు కణికుడు దగాచేసి శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలరా దిట్ట. అటువంటి కుటిల నీతిజ్ఞుడైన అతడు ధృతరాష్ట్రుడికి చెప్పిన కథ ఇది .

                     అనగా అనగా అనగా అనగా ఒక అరణ్యం అందులో అనేక క్రూర మృగాలు నివసిస్తుండేవి నివసిస్తుండేవి. అక్కడ ఒక నక్క ఉండేది. అది తెలివిగలది. తన పనులన్నీ ఇతరులతో చేయించుకుని పని పూర్తి కాగానే ఇతర జంతువులను మోసం చేసి ఆ ఫలితాన్ని హాయిగా అనుభవించేది. 

                నక్కకు పులి తోడేలు ముంగిస ఎలుక తో సహా నాలుగు జంతువులతో స్నేహం ఉండేది. వాటితో కలిసిమెలసి ఉన్నట్లు నటిస్తూ తిరిగేది. ఒక నాడు నక్క తన స్నేహితులతో అడవిలో తిరుగుతూ ఉంది. బాగా బలిసిన లేడీ చెంగు చెంగున గంతులువేస్తూ కనిపించింది. ఈ స్నేహితులను చూడగానే లేడి దూరంగా పోయింది. నక్క ఎలాగైనా లేడి మాంసం భక్షించాలని అనుకుంది. ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు.

                      నక్క తెలివిగలది అయినందువల్ల ఉపాయము ఆలోచించింది. మిత్రులతో మాట్లాడుతూ ఈ లేడి ఎంత అందంగా కనబడుతుంది. దాని రూపురేఖలు దాని మాంసం యొక్క రుచిని తెలుపుతున్నాయి. అయితే దానితో పరుగెత్తే శక్తి మనలో ఎవరికీ లేదు. దానిని మోసంతో చంపాలి. ఆ పన్నాగం నేను చెబుతాను. చంపిన పిదప మనం దాని మాంసం హాయిగా తినవచ్చునని అక్క చెప్పింది. జంతువులకు నోరూరింది.

                           "త్వరగా ఎలా చంపాలో చెప్పు " అంటూ ఆ నాలుగు జంతువులు అడిగాయి. "మీరు శ్రద్ధగా వినండి ఆ లేడి మెలుకువగా ఉండేటప్పుడు మనం ఎలాగూ చంపలేం . అది అలసి నిదురించే సమయం కనిపెట్టాలి. మెల్లగా చప్పుడు లేకుండా పోయి ఎలుక దాని కాళ్లు కొరకాలి. అదే అదనుగా పులి దాని మెడను కొరికి వేయాలి" . అంది నక్క.

                           జంతువులన్నీ నక్క ఉపాయానికి సంతోషించాయి . ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురు చూసాయి. లేడి చెంగుచెంగున గంతులేస్తూ గడ్డి మేసింది . సెలయేరులో నీరు త్రాగింది . చాలా అలసి ఉండడంతో కాళ్లను చాపుకొని నిద్ర పోయింది. 

                  నక్క మాట ప్రకారం అదను చూసి ఎలుక లేడి కాళ్ళను ఒక్క ఉదుటున కొరికింది. బాధతో లేడి లేవ బోయింది. అంతే పులి లంఘించి మెడను కొరికింది. నక్క తో పాటు జంతువులు దాని చుట్టూ చేరాయి నక్క మిత్రులను చూసి స్నేహితులారా స్నేహితులారా మాంసం మనం ఆనందంగా తినాలి మీ శరీరాలు దుమ్ము ధూళితో ఎన్ని ఉన్నాయి కొండ లోయలోని   సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అంది నాలుగు స్నానానికి వెళ్ళాయి. 
                  
                       ముందుగా పులి లంఘిస్తూ తినాలని ఆతృతతో వచ్చింది. నక్క కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నది పులి "బావా ఎందుకు కు అంతగా ఏడుస్తున్నావు" అని అడిగింది .

                        పులి బావా!  మన మిత్రుడు ఎలుక ఏమందో తెలుసా ? పులి ఎంత పెద్ద జంతువు.  బలమైనది అయినా ఏమి లాభం! నేను కాళ్లు కొరికిన తర్వాతే పులి పంజా విసిరింది . నా తెలివితో చంపిన లేడిని తినడానికి ముందుగా సిద్ధపడింది అంటూ నిట్టూర్పు విడిచింది . పులి పులికి గొప్ప పౌరుషం వచ్చింది .

                     "నక్క బావా ! ఆ ఎలుక నాకు కనువిప్పు కలిగించింది. ఇకనుండి నా స్వయంశక్తితో సంపాదించి తింటాను .  ఇతరులపై ఆధారపడను" అంటూ రోషంగా వెళ్ళిపోయింది. పులి తోడేలుని చంపు వెతుకుతుందని చెప్పడంతో తోడేలు పారిపోయింది తరువాత ఎలుక వచ్చింది. 'ఎలుకా! వింటివా! లేడిని పులి చంపింది . ఇది విషపూరితమైనది. దీనిని నేను తినను. ఎలుకను తిని ఆకలి తీర్చుకుంటాను అని ముంగిస వస్తుంది. అదిగో అటు చూడు!' అంటూ నక్క చెప్పగానే ఎలుక చెంగునపోయి కలుగు లో దూరింది. 

          ఇంతలో ముంగిస వచ్చింది.

                   " చాలా ఆశతో వచ్చావు రా! రా! వారి ముగ్గురిని చంపి పారేసాను. నీకు ధైర్యం, బలం ఉంటే నన్ను జయించి ఈ లేడి మాంసం తిను" అంది నక్క. ముంగిస భయంతో పరుగుతీసింది. లేడి మాంసం సుష్టుగా నక్క తిన్నది. . 

                      "విన్నారా మహారాజా మన తెలివితో వంచన అని తలంపక మన కార్యాలు నెరవేర్చు కోవాలి:. అని కణికుడు దృతరాష్ట్రునితో చెప్పాడు.కణిక నీతిని అలవర్చుకున్న కౌరవులకు తరువాత ఏమి జరిగిందో మనకు తెలిసిందే.    
 
 
 

   
 
 
 

Post a Comment

0 Comments