నేర్పరితనం
బూరగాన దుర్గాప్రసాద్ - పార్వతీపురం
పార్వతీపురానికి సమీపంలోని విశ్వదుంధుబి రాజ్యాన్ని శ్రీపాలుడు పరిపాలిస్తుండేవాడు. శ్రీపాలుడు ఒక రోజున హుటా..హుటిగా..! సభను ఏర్పాటు చేశాడు.ఆ సమావేశానికి ఆ రాజ్యంలోని మంత్రులూ...,మేధావులు,పండితులు,విధ్వాంసులు హాజరయ్యారు. శ్రీపాలుడు సభను ఉద్దేశించి, " విశ్వదుంధుబి రాజ్య మేధావులకు,మంత్రులకు,పండితులకు నా నమఃసుమాంజలి.ఇందు మూలంగా...,నేను చెప్పదల్చుకుందేంటంటే....రాత్రి,మా స్వప్నంలో ఒక విచిత్రమైన ప్రశ్న నన్ను వేదించింది! ఆ ప్రశ్న ఏంటంటే..? నీ రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే... ఈ రాజ్యంలో ఉండకూడని అంశాలు ఏమిటీ?? అదిక సంపదా....? సోమరితనమా....?? మీరు చెప్పండి." అని రాజుగారు సభలోని వారిని అడిగారు. సభలోని వారందరూ...భాగా ఆలోచించి ఆ రెండింటిలో ఒక సమాధానాన్ని ఒక్కొక్కరూ.. ఒక్కో విధంగా... చెప్పారు. కానీ సభలోని ఒక ముసలివాడు సమాధానం చెప్పలేదు. మహారాజు ముసలివాని వైపు చూస్తూ..ఓ... పెద్దాయనా...? మీరెందుకు సమాధానం చెప్పలేదు! ఈ సమాధానం నచ్చకనా..?? లేక సమాధానం తెలియకనా....?? మాట్లాడండీ.... మహాప్రభూ..!! నిజం చెప్పక తప్పదు! ఈ సమాధానం నాకు నచ్చలేదు. మహారాజు ఉద్రేకంతో... "అయితే మీ సమాధానం చెప్పండీ."? మహాప్రభూ... నాకు కొంత సమయం కావాలి! ముందుగా...ఈ రాజ్యంలొని సోమరివాళ్లను తీసుకురండీ... అని విన్నవించెను.అపుడు మహారాజు మంత్రితో..." మహామంత్రి..! మన రాజ్యంలోని ఏ పని చేయని సోమరివాళ్లను బంధించి తీసుకురండి అని ఆఙ్ఞాపంచెను.రాజు ఆఙ్ఞతో భటులు రాజ్యం మొత్తం తిరిగి , ఓ ముగ్గుర్ని బంధించి రాజు వద్దకు తీసుకువచ్చి , మహాప్రభూ...! వీళ్లు సోమరికే సోమరి వాళ్లు .వీళ్లు తినడం,తిరగడం తప్పా... ఏ పని చేయరు. రాజు ఆ మాటలకు కోపంతో... ఆ ముసలివాని వద్దకు వెళ్లి , "చూశారా...! ఇలంటి వాళ్లతో రాజ్యానికి నష్టమే గాని లాభం లేదు. వీళ్లకు మరణ శిక్ష ఒక్కటే... పరిష్కారం అని, రాజు మాటలకు ఉలిక్కిపడి , మహా ప్రభూ...!! ఈ ముగ్గురినీ వేరు వేరు గదులలో బంధించి ఒక రాయిని ఇచ్చి వాటితో ఏమి చేయవచ్చోసమాధానంరాబట్టండి.తరువాతనేను సమాధానం చెబుతాను అని పలికెను . ఆ మాటలకు రాజు అంగీకరించిఆ విధంగా చేసెను . మొదటివానికి రాయి ఇచ్చి , ఈ రాయితో ఏమి చేయగలవు అన్నపుడు వాడు ఈ రాయితో తూనికలు వేయవచ్చు అని సమాధానం చెప్పెను .రెండవ వాడు ఈ రాయితో ముగ్గుపిండి చేయవచ్చు అని పలికెను . ఇక మూడవవాడు ఈ రాయితో శిల్పం చెక్కవచ్చు అనిచెప్పెను . ఈ మూడు సమాధానాలను రాజు ముసలివానివద్ద ప్రస్థావించెను . అపుడు ముసలివాడు చూసారా మహారాజా ఈ ముగ్గురూసోమరి వాళ్ళు కావచ్చు కానీ వీళ్ళలో సృజనాత్మకత దాగిఉంది . కావున సోమరివాళ్ళలో సృజనాత్మకత వెళికి తీసే శక్తి నేర్పరితనానికే ఉంది . కావున రాజుకు ముఖ్యంగా ఉండవలసింది నేర్పరితనం అని పలికెను.ఆ మాటలకు రాజు ఎంతో ఆనందించి ఆ ముసలివాణ్ణి సన్మానించెను .

3 Comments