మానవ శరీర చర్మపు రంగు శరీరం లోని వర్ణ సంబంధ పదార్థాల పై ఆధారపడి ఉంటుంది. అవి మెలనిన్ ,కరోటిన్ , హిమోగ్లోబిన్ . మెలనిన్ గోధుమ వర్ణం లో ఉంటుంది. కెరోటిన్ పసుపురంగులో ఉంటుంది. హిమోగ్లోబిన్ ఎరుపు రంగులో ఉంటుంది . ఈ మూడు లేనిచో చర్మం రంగు పాలనురుగులా తెల్లగా ఉంటుంది. పై మూడు పదార్థాలు భిన్న నిష్పత్తులలో ఉన్నప్పుడు వివిధ రకాల చర్మ రంగులు ఏర్పడతాయి. మెలనిన్ ఎక్కువగా ఉన్నపుడు శరీరం రంగు నల్లగా ఉంటుంది . కెరోటిన్ ఎక్కువగా ఉన్నపుడు చర్మం రంగు పసిమి రంగులో ఉంటుంది. ఆల్ట్రావైలట్ కిరణాలు చర్మానికి తాకితే మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువలన వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రజల చర్మం రంగు నల్లగా ఉంటుంది . చల్లని ప్రదేశాలలో ఉండే ప్రజలు చర్మం రంగు తెల్లగా ఉంటుంది . ఒకే ప్రాంతంలో ఉండే ప్రజల చర్మం రంగులో కూడా కొద్ది తేడాలుంటాయి.
0 Comments