ఎండా కాలంలో ఏదైనా వస్తువును ఎండలో ఉంచితే బాగా వేడెక్కపోతుంది. అదే ఇనుము లాంటి వస్తువు అయితే చేయి కాలిపోయేంత బాగా వేడెక్కి పోతుంది. మరి మొక్కలు ఎండలో ఉన్నప్పటికీ వాటి యొక్క ఆకులు ఎందుకు వేడెక్కవు. మీకు తెలుసా?
చెట్ల ఆకులు కణముల యొక్క అనేక పొరలతో ఏర్పడి ఉంటాయి. దిగువ భాగాన ఉండే పొరలలో అనేక రంధ్రాలు ఉంటాయి. వీటిని స్టొమేటా అంటారు . ఈ రంధ్రములు కవాటముల వలె పనిచేస్తాయ. ఇవిిిి తెరచి ఉన్నప్పుడుు కార్బన్ డయాక్సైడ్ ఆకుల లోనికి పోనిస్తాయి . ప్రాణవాయువును, నీటి కణములను బయటకు వదులుతాయి. ఈ రంధ్రములు మూసుకొని ఉన్నప్పుడు గాలి బయటకు వెళ్లడం గాని లోనికి పోవడం గాని జరగదు. ఈ రంధ్రములు పగటివేళ తెరుచుకుని ఉండి రాత్రివేళ మూసుకుని ఉంటాయి. మొక్కలు స్టొమేటా అనబడే రంధ్రముల ద్వారా బయటకు పోయే నీరు మరలా వేళ్ళ ద్వారా పీల్చుకుంటాయి . దీనినే భాష్పోత్సేకం అంటారుు . ఈ భాష్పోత్సేకం వలన ఎండలో కూడా మొక్కల ఆకులు చల్లగా ఉంటాయి భాష్పీభవనం వల్ల చల్లదనం కలుగుతుందని మనకు తెలుసు భాష్పోత్సేకం ద్వారా నిరంతరం భాష్పీభవనం చెందడం చేత ఆకులు వేడెక్కక చల్లగా ఉంటాయి.

0 Comments