తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవన యానం చేసెదమా
సాగరమేఖల చుట్టుకుని – సుర గంగ చీరగా మలచుకుని
గీతాగానం పాడుకుని – మన దేవికి ఇవ్వాలి హారతులు !తేనెల!
గాంగ జటాధర భావనతో – హిమ శైల శిఖరమే నిలబడగా
ఆ — ఆ..
గల గల పారే నదులన్నీ – ఒక బృంద గానమే చేస్తుంటే !తేనెల!
ఎందరో వీరుల త్యాగఫలం – మన నేటి స్వచ్ఛకే మూలబలం
వారందరిని తలచుకుని – మన మానస వీధిని నిలుపుకుని !తేనెల!
0 Comments